212 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సివిక్ యాక్షన్ ప్రోగ్రాం
On
విశ్వంభర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : - 212 బెటాలియన్ ఆధ్వర్యంలో, ఛత్తీస్‌గఢ్ సెక్టార్ కు చెందిన 212 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో, సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ఎంతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, పోత్కపల్లి మరియు కిష్టారాం ప్రాంతాలకు చెందిన గ్రామస్తులకు రేడియోలు, దుప్పట్లు, చీరలు, నీటి ట్యాంకులు మరియు అవసరమైన మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ సనంపెంట, పటేల్‌పర, బజార్‌పర, పలోడి, పోత్కపల్లి మరియు కిష్టారాం గ్రామాల వారికి లభించింది.ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం గ్రామస్తులలో పోలీసుల పట్ల విశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడమే. దీనిద్వారా గ్రామస్తులను సమాజ ప్రధాన స్రవంతితో అనుసంధానించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను కొంటా రేంజ్ ఆదేశాల మేరకు, 212 బెటాలియన్ కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ నాయకత్వంలో నిర్వహించారు. కిష్టారాంలో జరిగిన కార్యక్రమంలో E/212 బెటాలియన్ కు చెందిన సామ్వే ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ మనోజ్ కుమార్ పాండే మరియు D/212 బెటాలియన్ కు చెందిన సామ్వే ఆఫీసర్ అసిస్టెంట్ కమాండెంట్ రోహిత్ శుక్లా గ్రామస్తులకు ఆహారం మరియు రిఫ్రెష్‌మెంట్‌లు అందించారు.ఈ కార్యక్రమాన్ని సెకండ్ కమాండ్ ఆఫీసర్ దినేష్ కుమార్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ జిడి సరోజ్ కుమార్ సాహు, సబ్‌ఇన్స్పెక్టర్ జిడి సోహన్ లాల్ ఇల్వా మరియు ఎస్.కె. పాంబోయ్ (టిఐ) తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం గమనార్హం.



