చేవెళ్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతుందో లేదో*

చేవెళ్లలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతుందో లేదో*

విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్ల లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం చేవెళ్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని భాజపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే కె ఎస్ రత్నం డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం కోసం రూ.17.50 కోట్లు  మంజూరైన ఎందుకు పనులు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కనీసం భూ సేకరణ సైతం చేపట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షులు అత్తిలి అనంత రెడ్డి, శ్రీకాంత్ బీజేపీ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి ఆంజనేయులు శర్వలింగం వెంకట్ రెడ్డి జయశంకర్ ఇంద్రసేనారెడ్డి సత్యనారాయణ అశోక్ శ్రీనివాస్ బాగా వెంకటేష్ తిరుపతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభిషేక్ రెడ్డి రాజు మహేందర్ రెడ్డి గణేష్ మెట్టు శివ తదితరులు పాల్గొన్నారు

Tags: