కార్యకర్త కిరాణం స్టోర్ ను ప్రారంభించిన వరంగల్ కుడా ఛైర్మన్
On
విశ్వంభర, హనుమకొండ : సంగెం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎండి.రియాజ్ , ప్రశాంత్ జనరల్ కిరాణం స్టోర్ ను వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ కాంగ్రేస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి ప్రారంభించారు. అనంతరం షాప్ యొక్క యజమాని కుడా ఛైర్మన్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరలో ఉండే విధంగా సరుకులు ఉన్నావని అన్నారు. రానున్న రోజుల్లో కూడా దినదినాభివృద్ధి చెంది ఉన్నత స్థాయిలకు ఎదగాలని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు.



