డిడి కాలనీలో బిటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

డిడి కాలనీలో  బిటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

విశ్వంభర,అంబర్పేట్ : బాగ్ అంబర్ పేట డివిజన్ డిడి కాలనీ లో సుమారుగా 40 లక్షల  రూపాయల నిధులతో చేపట్టిన బిటీ రోడ్ పనులకు అంబర్పేట్ ఎమ్మెల్యే  కాలేరు వెంకటేష్ బాగ్ అంబర్ పెట్ డివిజన్ కార్పొరేటర్  పద్మా వెంకటరెడ్డి తో కలిసి,    సాయి బాబా టెంపుల్ నుండి రామక్రిష్ణ నగర్ వరకు బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం ఎమ్మెల్యే డిడి కాలనీలో పాదయాత్ర చేసారు. ఈ సందర్బంగా  గత కొన్ని రోజులుగా స్ట్రీట్ లైట్స్ సమస్య ఉందని స్థానికులు ఎమ్మెల్యే  తెలియజేయడంతో తక్షణమే స్ట్రీట్ లైట్ సిబ్బంది మరియు అసిస్టెంట్ ఇంజనీర్ సౌమ్య తో మాట్లాడి సమస్య పరిష్కారం కొరకు నూతన స్ట్రీట్ లైట్లు  వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ విష్ణు వర్ధన్ రావు,జీహెచ్ఎంసి డిఈ ప్రశాంతి,ఎలెట్రికల్ ఏఈ సౌమ్య , వర్క్ ఇన్స్పెక్టర్ రవి, రమేష్,బిఆర్ఎస్ పార్టీ బాగ్ అంబర్ పెట్ డివిజన్ అధ్యక్షుడు చంద్ర మోహన్  ,  సీనియర్ నాయకులు, కార్యకర్తలు,మహిళా నాయకులు, స్థానిక కాలని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: