నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష

తెలంగాణలో ఇవాళ(ఆదివారం) గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణలో ఇవాళ(ఆదివారం) గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరీక్షలకు దాదాపు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీ అభ్యర్థికి యూనిక్ ఓఎంఆర్ షీట్‌ను ఇవ్వనున్నట్లు ఇప్పటికే కమిషన్ ప్రకటించింది. 

రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో 897 ఎగ్జామ్ సెంటర్లను కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి పరీక్షాకేంద్రంలోకి అనుమతిస్తారు. 10 గంటలలోపే పరీక్షా కేంద్రం లోపలికి చేరుకోవాలి. 10గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. 

Read More అక్టోబర్ 6న రంగ్ దే దాండియా నైట్ కార్యక్రమం 

అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ఐడి కార్డు, మూడు లేటెస్టు పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలని, షూస్‌ ధరించకుండా కేవలం చెప్పు లు వేసుకుని రావాలని, బయో మెట్రిక్‌ అటెండెన్స్‌ ఉన్నందున అభ్యర్థులు ఎవరూ మెహందీ, కోన్‌ లాంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, చేతి గడియారాలు, సెల్‌ఫోన్లు తీసుకొని వెళ్లడానికి అనుమతి లేదని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేశారు.