రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు అధికార పార్టీకేనా?

సిపిఐ పార్టీ డిమాండ్

WhatsApp Image 2025-01-20 at 16.03.42

విశ్వంభర, జూలూరుపాడు: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద కుటుంబాలకు ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదని ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ప్రతి పేదవాడికి వర్తింపచేయాలని లేనియెడల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండిపిన్ని వెంకటేశ్వర్లు, చాంద్ పాషా, శంకర్ నాయక్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడంపై CM స్పందన

Tags: