తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం..!
గుట్కాను నిషేధించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుట్కాను నిషేధించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు గుట్కా తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గుట్కా, పాన్ మాసాలలో ఆరోగ్యానికి హాని కలిగించే పొగాకు, నికోటిన్ ఉండడం మూలంగానే వాటిని నిషేధించినట్లు పేర్కొన్నారు.
గుట్కాను తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అటు యువతపై ప్రభావం చూపుతున్న మాదకద్రవ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు.
ఆ ఉత్తర్వులో ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30 లోని సబ్-సెక్షన్ (2)లోని క్లాజ్ (a) కింద అందించబడిన అధికారాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2011 ప్రజారోగ్య దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్, పొగాకు, నికోటిన్‌లను పొగాకు, పౌచ్‌లు, ప్యాకేజీ, టెయినర్లు తదితర వాటిలో ప్యాక్ చేసిన గుట్కా, పాన్‌మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలను నిషేధించారు. ఈ నిషేధం 24 మే 2024 నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.