నిలిచిన సింగరేణి బొగ్గు ఉత్పత్తి
On
విశ్వంభర భూపాలపల్లి జూలై 20 :-జయశంకర్ భుపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది.వర్షం కారణంగా భుపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్2,3 గనుల్లో రోడ్లన్నీ బురద మయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది.6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయయం ఏర్పడగా సింగరేణి సంస్థ కు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు