పాతబస్తీలో ప్రజల ఆదరణ చూర గోంటున్న సిద్ధి వినాయక థీమ్
On
విశ్వంభర/ హరి బౌలి:- హరిభౌలిలోని సంజయ్ చారి హాస్పిటల్ ప్రాంగణంలో , రైసింగ్ స్టార్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2009 లో రెండు అడుగుల తో మొదలై న గణనాథుని కొలువులు 2026లో 12 ఫీట్లతో సిద్ధి వినాయక రూపంలో గణపతిని నెలకొల్పి, ఈ దీంతో ప్రజల ఆదరణ పొందుతున్నారు. ఈ యొక్క మంటపానికి భక్తుల తరలిరావడం చాలా సంతోషంగా ఉందని అసోసియేషన్ సభ్యులు శ్రీనాథ్ తెలిపారు. సభ్యులు మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా కొత్తదనాన్ని కోరుకునే విధంగా తయారు చేస్తామని, ప్రజల ఆదరణ మాపై ఉండేటట్టు కోరుకుంటున్నామని, ఆ గణనాయకునికి వేడుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజానందు,విశాల్, నిఖిల్, పృథ్వీ, ప్రథమ్, ఆనంద్, రాహుల్, నితీష్,అక్షయ్, తదితర సభ్యులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నట్టు తెలిపారు.



