సన్ షైన్ విద్యార్థులకు ఘన సన్మానం.

చెకుముకి టాలెంట్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ.

సన్ షైన్ విద్యార్థులకు ఘన సన్మానం.

విశ్వంభర, చండూర్ :- మండల స్థాయిలో జరిగిన చెకుముకి టాలెంట్ టెస్ట్ లో మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి మొదటి స్థానం పొంది జిల్లాస్థాయిలో పాల్గొనడానికి అర్హత సాధించిన సన్ షైన్ హై స్కూల్ విద్యార్థులైన శ్రీనిధి, సిరి, శాశ్వత్ లను పాఠశాలలో కరస్పాండెంట్ కోడి వెంకన్న శాలువా, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెకుముకి ప్రతిభ పరీక్ష యందు వరుసగా రెండో సంవత్సరం మొదటి స్థానం సంపాదించడం ద్వారా సన్ షైన్ విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలతో పాటు పాఠశాల పేరును కూడా ఉన్నత స్థాయిలో ఉంచారని అదేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు రవికాంత్, వినయ్, ప్రవీణ్, ఆదిత్య, దేవేందర్ మరియు నాగమణి టీచర్ లను  కోడి వెంకన్న అభినందించారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు ఇటువంటి పోటీ పరీక్షల యందు కూడా ప్రతిభ కనబరుస్తూ సమాజంలో జరిగే అన్ని రకాల విషయాలపై విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు సాగడం ద్వారా భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించవచ్చు అని అన్నారు.

Tags: