బీసీ హాస్టల్స్ పెంచాలి. శాశ్వత భవనాలు నిర్మించాలి. - విద్యార్థి నాయకుడు చాపల అనిల్ కుమార్ డిమాండ్

బీసీ హాస్టల్స్ పెంచాలి. శాశ్వత భవనాలు నిర్మించాలి. - విద్యార్థి నాయకుడు చాపల అనిల్ కుమార్ డిమాండ్

విశ్వంభర, హైదరాబాద్ :- హైదరాబాద్ లో బీసీ హాస్టల్స్ సంఖ్యను పెంచాలని, అద్దె భవనాల్లో కాకుండా శాశ్వత భవనాల్లో హాస్టల్స్ నిర్వహించాలని విద్యార్థి నాయకుడు,  చాపల అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..."తెలంగాణలోని పల్లెటూర్ల నుంచి చదువు కోసం ఎంతో ఆశతో హైదరాబాద్ వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులు బీసీ  హాస్టల్ లో సీట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, ప్రైవేట్ హాస్టల్ లో ఉండే పరిస్థితి లేక, ఇష్టం లేకున్నా చదువుకు స్వస్తి పలుకుతున్నారు. ఇది చాలా బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ప్రధాన డిమాండ్లును ప్రస్తావించారు. హాస్టల్స్ సంఖ్య పెంచాలనీ  విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బీసీ  హాస్టల్స్ లేవనీ , కొత్త హాస్టల్స్ 100 కు పైగా మంజూరు చేయాలనీ అన్నారు. బీసీ హాస్టల్స్ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయనీ , ప్రతి ఏడాది భవనం మారడం వల్ల విద్యార్థుల చదువు దెబ్బతింటుంది అన్నారు.  ఆహారంలో నాణ్యత ఉండాలనీ, ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు పునరావృతం కాకూడదనీ, సీట్లు లేక చదువు ఆగకూడదనీ అన్నారు. త్వరితగతిన ప్రభుత్వాలు దృష్టి సారించి బీసీ విద్యార్థులకు అండగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Tags: