చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు

చంద్రబాబుతో పోటీ పడాల్సి వస్తోంది.. రేవంత్ ఆసక్తికర కామెంట్లు



తెలంగాణ రాష్ట్రాన్ని డెలవప్ మెంట్ చేయడంలో తనకు చంద్రబాబుతో పోటీ వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. చంద్రబాబుతో పోటీ పడి మరీ తెలంగాణను డెలవప్ మెంట్ చేసే అదృష్టం తనకు దక్కిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి బాగా జరుగుతోందని ఆయన అన్నారు. 

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో మేలు: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ఇంతకు ముందు ఏపీ సీఎంతో తనకు పోటీ ఉండేది కాదని.. కాబట్టి తాను 8 గంటలు పనిచేస్తే సరిపోయేది అనుకునే వాడినన్నారు. కానీ ఇప్పుడు తాను కూడా చంద్రబాబు లాగా రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు. శనివారం నాడు ఆయన బసవతారకం ఆస్పత్రి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశారు. 

అయితే చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఇలాంటి పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రేవంత్.. ఇప్పుడు తన గురువు కాబట్టి చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.