తెలంగాణలో ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల
On
విశ్వంభర, వెబ్ డెస్క్ : తెలంగాణ ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 74.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ లో ఫస్ట్ ర్యాంక్ ఎస్. జ్యోతిరాదిత్య( శ్రీకాకుళం, పాలకొండ), రెండో ర్యాంక్ హర్ష (కర్నూల్-పంచలలింగాల), మూడో ర్యాంకు రిషి శేఖర్ శుక్లా(సికింద్రాబాద్ - తిరుమలగిరి), నాలుగో ర్యాంకు సందేశ్( హైదరాబాద్- మాదాపూర్), ఐదో ర్యాంక్ సాయి యశ్వంత్ రెడ్డి (కర్నూల్)సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ఫస్ట్ ర్యాంక్ ప్రణీత(మదనపల్లె), రెండో ర్యాంకు రాధకృష్ట(విజయనగరం), మూడో ర్యాంక్ శ్రీ వర్షిణి(హనుమకొండ), నాలుగో ర్యాంకు సాకేత్ రాఘవ్(చిత్తూరు), ఐదో ర్యాంక్ సాయి వివేక్(హైదరాబాద్) సాధించారు.
Tags: EAP Set Results