బెదిరింపులకు గురి చేస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
విశ్వంభర, యాదాద్రి భువనగిరి జిల్లా : రామన్నపేట మండలం, జనంపల్లి గ్రామంలో ఉన్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై విద్యార్ధినుల తల్లిదండ్రులు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ప్రతి రెండో ఆదివారం తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించకుండా, స్కూలుకు రాకుండా విద్యార్థుల పర్యవేక్షణ చేయవలసిన ప్రిన్సిపాల్ కాస్త సామాజిక కోణంలో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆదివారం జరిగిన ధర్నా కార్యక్రమంలో తల్లిదండ్రులు తెలిపారు. ఈయనపై గ్రామవాసులు చెప్పిన వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం అడ్మిషన్ల పేరుతో గ్రామంలో కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్క అడ్మిషన్ కు 40 వేల నుంచి 60 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆ ప్రిన్సిపాల్ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకొని తాను అడ్మిషన్స్ అలా చేయడం లేదని గత నాలుగు సంవత్సరాల నుండి తన యొక్క ప్రాబల్యాన్ని చూపించుకుంటూ, బెదిరించుకుంటూ "నేను సీతయ్యను నా ఇష్టం వచ్చిన టైం కు నేను పాఠశాలకు వస్తా, నా ఇష్టం వచ్చిన టైం కు నేను పాఠశాల నుంచి వెళతా, అంతా నా ఇష్టం" అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు. డబ్బులు ఇచ్చిన వారిని తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమిస్తూ వారి జీతంలో 20 శాతం కోత విధిస్తూ, ఎవరైనా ఎదురు తిరిగితే వారిని విధుల నుంచి తొలగించడం చేస్తున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. వాస్తవానికి పాఠశాలలో బాత్రూంల సమస్య, వాచ్ మ్యాన్ సమస్య, కోతుల సమస్య, నాణ్యమైన భోజనం లేని సమస్య, పాఠశాల ప్రాంగణం కబ్జాకు గురైన సమస్య, తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ, గ్రామానికి చెందిన ఒక అటెండర్ ద్వారా మిగతా వారిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఆయన అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అంతా తానై ఏ సమస్య వచ్చినా, తన ముందుకు వేసుకుంటూ ముందుకు వస్తున్నాడు. రామన్నపేటకు ఎంతో కాలం తర్వాత ఒక గొప్ప నాయకుడు దొరికిండు అన్న సమయంలో ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాంతానికి గురుకుల పాఠశాల తీసుకువచ్చిన వ్యక్తి యొక్క ఆశయాలను ఆ గ్రామంలో ఉన్న కొంతమంది బ్రోకర్లు ఆయన యొక్క పేరును అన్ని విధాల వాడుకొని పాఠశాలలను నేడు బజారుకు ఈడుస్తున్నారని పేర్కొన్నారు. .