గుండాల విద్యార్థుల సమస్యలపై తహసీల్దార్‌కు  వినతిపత్రం

విశ్వంభర, గుండాల:  గుండాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, వివిధ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు పింగళి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తహసీల్దార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహానికి వెంటనే శాశ్వత వార్డెన్‌ను నియమించాలని, అలాగే గుండాల బీసీ బాలుర వసతి గృహంలో ఇన్‌చార్జి స్థానంలో పర్మనెంట్ వార్డెన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీతారాంపురం ఎస్సీ బాలల వసతి గృహాన్ని గుండాల మండల కేంద్రానికి మార్చి ఏర్పాటు చేసి, మోడల్ స్కూల్ విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. మరోవైపు బస్సు సౌకర్యం లేని అంబాల, వంగాల, నూనెగూడెం గ్రామాలకు వెంటనే ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థులు, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి మచ్చ వివాకర్ రెడ్డి, మైపాల్ రెడ్డి, గొల్లపల్లి సురేష్, ఆవుల సాయి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.

🕒 04 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/petition-to-tehsildar-on-the-problems-of-gundal-students/article-17856

Tags: