కొండగట్టులో పవన్ కల్యాన్ ప్రత్యేక పూజలు

కొండగట్టులో పవన్ కల్యాన్ ప్రత్యేక పూజలు



ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌ కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన పవన్ కల్యాణ్‌ కు ఈవోతో పాటు ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి మరీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Read More సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలి - చిలుక మధుర ఉపేందర్ రెడ్డి

పవన్ కల్యాణ్‌ వచ్చాడని తెలుసుకుని ఆయన అభిమానులు భారీగా ఆలయం వద్దకు చేరుకున్నారు. కొండగట్టు నిండా పవన్ కల్యాణ్‌ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అభిమానులు. దాంతో కొండగట్టులో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏపీలో పార్టీ గెలుపుతో పవన్ కల్యాణ్‌ కొండగట్టుకు వచ్చారు. 

గతంలో తన వారాహి వాహనాన్ని కూడా ఇక్కడే పూజలు చేయించారు. తనకు మొదటి నుంచి కొండగట్టు బాగా కలిసి వచ్చిందని పవన్ కల్యాణ్‌ చెబుతుంటారు. అందుకే తనకు కలిసి వచ్చిన కొండగట్టుకు డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు పవన్ కల్యాన్.