మొక్కలను పెట్టడమే కాదు కాపాడుకునే బాధ్యత వహించాలి

WhatsApp Image 2024-07-22 at 17.35.32_aa6a2ddfవిశ్వంభర, ఆమనగల్లు, జూలై 22 : -  ఆమనగల్ మున్సిపాలిటీ విఠాయిపల్లి 10వ వార్డు లో కౌన్సిలర్ సుజాత రాములు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమం లో భాగంగా కమిషనర్ వసంత చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య లతో కలిసి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసి పలుచోట్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి  ఇంటికి  మొక్కలు  ఇవ్వడం జరిగింది అనీ, ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాలని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని,WhatsApp Image 2024-07-22 at 17.35.33_0286c0faఅందుకే తెలంగాణ ప్రభుత్వం వన మహోత్సవం, హరితహారం కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి వహించి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరం పెట్టిన చెట్లను వదిలేయకుండా తరచూ వాటికి నీరును పోస్తూ జంతువుల నుండి పక్షుల నుండి చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చక్కల లక్ష్మణ్, 
 చెన్నకేశవులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు