నాగచైతన్య – సమంత విడాకులకు ఫోన్ ట్యాపింగే కారణం...బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు
విశ్వంభర, ఇందిరాపార్క్ : టాలీవుడ్ జంట అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకులకు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూనే కారణమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవసహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేయించి ఓ ఫైల్ రెడీ చేయించారని అన్నారు. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వినా కొద్దీ కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ ఐడీ అధికారలు...టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో ట్యాపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది. అందరి వేళ్లూ పెద్దాయన వైపే ఉన్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకూ కోనసాగింది. తాజాగా ఈ వ్యవహారం వల్ల టాలీవుడ్ జంట విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బూర నర్సయ్య గౌడ్ వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి దారి తీస్తోంది. ఇందులో ఎంత నిజముందో వేచి చూడాల్సిందే.