జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంజర్ల విజయలక్ష్మి.!

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా కంజర్ల విజయలక్ష్మి.!

  • బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని పై పోటీగా మహిళను దించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ.
  • కంజర్ల కుటుంబానికి నియోజకవర్గం లొ మంచి సంబంధాలు.
  • బీసీ, యాదవ వర్గానికి చెందిన మహిళా కావడం తో కంజర్ల విజయలక్ష్మి వైపే కాంగ్రెస్ అధిష్టానం చూపు

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల పైన పార్టీలు ఫోకస్ చేసాయి. స్థానిక సంస్థల ఎన్నికలు,జూబ్లీహిల్స్ బై పోల్ ఇప్పుడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఒకటి రెండు రోజుల్లోనే స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది. ఇక.. వచ్చే నెల తొలి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్ధి ని ఖరారు చేసింది. కాగా, కాంగ్రెస్ లో సీటు కోసం పోటీ నెలకున్న వేళ, రోజుకో కొత్త అభ్యర్థులు తెర మీదకు వస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఆశావాహులు పెరిగిపోతున్నారు.  టికెట్‌ ఆశీస్తున్నవారు ఎక్కువగా ఉండటంతో అభ్యర్థిని ఖరారు చేయడంలో కాంగ్రెస్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. కాగా కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, కంజర్ల విజయలక్ష్మి, బొంతు రామ్మోహన్,అంజనీకుమార్‌ యాదవ్‌, తదితరులు టికెట్‌ ఆశీస్తున్నా వారిలో ముందజలో ఉన్నారు.అదే సమయంలో బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి గోపినాథ్‌ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. మాగంటి సునీతతో పాటు కుటుంబ సభ్యులు ఇప్పటికే  ప్రచారం  ప్రారంభించారు.

 జూబ్లీహిల్స్‌లొ బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని బరిలోకి దించడంతో.. కాంగ్రెస్ కూడా అదే స్టాటజీని వర్క్‌ ఔట్‌ చేయాలని భావిస్తోందని తెలియడంటో మాజీమంత్రి కంజర్ల లక్ష్మీనారాయణ కోడలు కంజర్ల విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ఆమె కూడా తనదైన ప్రయత్నాట్లో టికెట్‌ ఆశిస్తున్నారు. ఒకప్పటి ముఖ్యమంత్రి జలగం వెంట్రావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ కోడలే ఈ విజయలక్ష్మీ. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళను అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్‌ అదే దారిలో పయనిస్తుంది. ఆమెకు పోటీగా మహిళను దించాలని భావిస్తోంది. అలా చేస్తే విజయలక్ష్మీకి అవకాశం దక్కే ఛాన్స్‌ ఉంది. ఇక  జూబ్లీహిల్స్‌లో యాదవ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆమెకు సామాజిక వర్గం కూడా కలిసివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది.  జూబ్లీహిల్స్ ప్రాంతంలో యాదవ్‌ లతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వారితోనూ కంజర్ల కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆమెకు టికెట్‌ ఇస్తే కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.  మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్‌ విషయంలో దూకుడుగా వెళ్తుంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీజీ రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటిస్తూ వస్తోంది. అయితే ఈ స్థానాన్ని బీసీ కి కేటాయించడం ద్వారా బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్శించాలని కూడా ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. విజయలక్ష్మి ద్వారా ఒక మహిళ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చామనే ప్రచారంతో పాటు యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఉల్పించడం ద్వారా బీసీ రిజర్వేషన్‌ కు కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. అంటే విజయలక్ష్మి ద్వారా మహిళా అభ్యర్థితో పాటు, బీసీ, యాదవ వర్గానికి టికెట్‌ ఇచ్చామనే సెంటిమెంట్‌ను కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. ఒకవేళ పార్టీ ఆశించినట్లు ఈ మూడు  అంశాల ఆధారంగా టికెట్‌ కేటాయిస్తే విజయలక్ష్మికి అవకాశం రానుంది. బీసీ సెంటిమెంట్, యాదవ సామాజిక వర్గం ఇలా అన్ని కలిసి వస్తే విజయలక్ష్మికి సీటు దక్కినట్లేనన్న ప్రచారం సాగుతోంది. 

Read More ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

నవీన్ దుమ్మాజి 
సీనియర్ కరస్పాండెంట్