వి ఆర్ ఎ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

WhatsApp Image 2024-07-10 at 11.53.22 AM

విశ్వంభర భూపాలపల్లి జూలై 10 :- తెలంగాణ రాష్ట్రములో మొత్తం vra లు 20555 మంది ఉండగా ఇందులో 81,85 జీవో ప్రకారంగా 16758 మందిని రెగ్యులర్ చేసి ఉద్యోగాలు ఇచ్చారని  మిగిలిన 61 సంవత్సరాలు దాటినా 3797 మంది vra వారసులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని గత గవర్నమెంట్ 81,85 జీవో జారీ చేసింది. ఇప్పటికి సర్కులర్ జారీ అయి సంవత్సర కాలం గడుస్తున్నా  61 సంవత్సరం దాటిన vra వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి vra వారసులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర  vra వారసుల జేఏసీ జిల్లా చైర్మన్ చెన్నపురి హరీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కో కన్వీనర్ గంధం సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి భూతం రాజు, కోశాధికారి చెన్నూరి కర్ణాకర్, మేనక, మధు సాయి వరుణ్, భద్రయ్య, రాజు, శంకర్, లావణ్య, నాలిక నర్సింహారాములు తదితరులు పాల్గొన్నారు.

Read More టిఅర్ఎస్ పార్టి కండువా వేసుకున్న మాజి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హారీష్ రావు