జగన్ ఇంటి నిర్మాణం కూల్చివేతలో అధికారిపై వేటు
లోటస్ పాండ్ లో జగన్ కు ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటి ముందు సిబ్బంది గదులను శనివారం ఉదయం జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. రోడ్డును ఆక్రమించి కట్టారని.. రాకపోకలకు ఇబ్బంది అవుతోందనే ఫిర్యాదులు అందాయని.. అందుకే కూల్చివేస్తున్నట్టు తెలిపారు అధికారులు.
దాంతో ఆ వార్త నిన్నటి నుంచి ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జగన్ కు అప్పుడే చిక్కులు మొదలయ్యాయని.. చంద్రబాబు సూచనతోనే రేవంత్ సర్కార్ చర్యలు తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ కూల్చివేతలో తాజాగా ఓ అధికారిపై వేటు పడింది.
ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ పై వేటు వేశారు జీహెచ్ ఎంసీ ఇన్ చార్జి కమిషనర్ ఆమ్రపాలి. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేసినందుకు గాను ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను జీఏడీ సాధారణ పరిపాలన విభాగంకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆమ్రపాలి. అయితే ఇలా చర్యలు తీసుకోవడం వెనక ఎవరి ఒత్తిడి అయినా ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి.