కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం…

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం…

విశ్వంభర, కామారెడ్డి : ఉదయం నుంచి ఎండ తీవ్రతను చూపించిన భానుడు సాయంత్రానికి కాస్తా చల్లబడ్డాడు. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షం కురుస్తుండగా... మరికొన్ని ప్రాంతాల్లో దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. దీంతో జిల్లా కేంద్రంలోని ఈవీఎం పంపిణీ కేంద్రం నుంచి ఈవీఎంలను నియోజకవర్గాలకు తరలిస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం పడింది. దీంతో టెంట్లు, ఇతర ఎన్నికల సామాగ్రి తడిచిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ సమయంలో భారీ వర్షం కురవడంతో పోలింగ్ సిబ్బంది అవస్థలు పడుతున్నారు.