తెలంగాణలో ప్రక్షాళన పర్వం.. నీటి పారుదలశాఖలో నలుగురు అరెస్ట్

తెలంగాణలో ప్రక్షాళన పర్వం.. నీటి పారుదలశాఖలో నలుగురు అరెస్ట్

తెలంగాణ ప్రభుత్వం అవినీతి అధికారుల భరతం పడుతోంది. కీలక శాఖల ప్రక్షాళనే లక్ష్యంగా ఏసీబీని రంగంలోకి దించింది.

తెలంగాణ ప్రభుత్వం అవినీతి అధికారుల భరతం పడుతోంది. కీలక శాఖల ప్రక్షాళనే లక్ష్యంగా ఏసీబీని రంగంలోకి దించింది. దీంతో.. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయి. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిశీలించి.. నిఘా పెట్టి సరైన సమయం చూసి అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. ఇవాళ నాంపల్లి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఇక నిన్న అర్థరాత్రి నుంచి రెడ్ హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీసులో సోదాలు జరిపారు.

రాత్రి నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో మొత్తం నలుగురు అవినీతి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్ ప్రస్తుతం ఏసీబీ అదుపులో ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు.. మరో అధికారి ఫైల్ మూవ్ చేయడానికి రెండున్నర లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇందులో ఫస్ట్ లక్షన్నర ఇచ్చిన బాధితుడు.. మిగిలిన లక్ష ఇచ్చే ముందు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో.. సరైన సమయం చూసి ఏసీబీ దాడులు చేసింది. లక్ష రూపాయలు చేతులు మారుతుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల