దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 

దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా -   సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 

విశ్వంభర, హైదరాబాద్ :- ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతున్న నేపధ్యంలో సమ్మెకు సంఘీభావంగా దిల్సుఖ్నగర్ డిపోలోని  ధర్నా కు TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ  మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై ఎనిమిది వేల ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ విలీనం , పీఆర్సీ, పే స్కేల్ , యూనియన్ ల ఏర్పాటు వంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకొని సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్బంగా వారు అన్నారు.  ఆర్టీసీ కోసం మేనిఫెస్టోను పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాలని  డిమాండ్ చేయడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమంలో డిపో ప్రెసిడెంట్ బి సైదాచారి, డిపో కార్యదర్శి , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అరుణ, డిపో జేఏసీ ముఖ్య  నాయకులు వెంకటయ్య , నిరంజన్ , IVK రెడ్డి, మోహన్ , తెలంగాణ శంకర్, KN REDDY, J P REDDY, శేఖరు, కరుణాకరు, ఎండి జాంగిర్, ఎండి హర్షద్ , రాజు, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు. 
 
Tags:  

Advertisement

LatestNews

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. - 
పెను ప్రమాదంలో పల్లె విద్యార్థుల భవిత -మాజీ టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  బిఆర్ఎస్  యువజన నాయకుడు బోయపల్లి రమేష్ 
దిల్సుఖ్ నగర్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల ధర్నా - సంఘీభావం తెలిపిన  TJMU ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు , తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కాచం సత్యనారాయణ 
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే 
టాస్ పరీక్షల్లో రెండవ సెషన్స్ లో 95 మంది గైర్హాజరు
ఘనంగా పంతంగి లో హిందూ సమ్మేళనం 
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నాం