బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలన్న ఈటల..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలన్న ఈటల..



ఈటల రాజేందర్ పేరు ఇప్పుడు బీజేపీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని అంటున్నారు. మొన్ననే అమిత్ షాను కూడా కలిసి వచ్చిన ఈటల.. రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఈటల రాజేందర్.. ఇప్పుడు తాజాగా రాష్ట్ర అధ్యక్ష పదవిపై సంచలన కామెంట్లు చేశారు.

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ఈటల రాజేందర్ తాజాగా మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా స్ట్రీట్ ఫైటర్ కావాలా.. రియల్ ఫైటర్ కావాలా.. నేను ఐదుగురు ముఖ్యమంత్రులుతో కొట్లాడాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని.. గల్లీల్లో కొట్లాడేవాళ్లు కాదని అన్నారు.. ఢిల్లీలో అయినా సరే దమ్ము చూపించేనాయకుడు కావాలన్నారు. 

అయితే ఆయన మాటల వెనక పెద్ద లోతైన అర్థం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా దేశం, ధర్మం, సమాజం పట్ల అందరినీ కలుపుకుని వెళ్లే నేతను నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ రీసెంట్ గా కామెంట్ చేసిన నేపథ్యంలోనే ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.