కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డీఎస్పీ.
On
విశ్వంభర భూపాలపల్లి జూలై 24 : -జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో బుధవారం కాటారం డిఎస్పీ రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మొక్కలు నాటారు.అనంతరం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సిబ్బందికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం డిఎస్పీ పోలీసు స్టేషన్ లో ఫైళ్ళను తనిఖీలు చేసారు.భారీ వర్షాల కారణంగా సెలవుపై తమ ఇండ్లకు వెళ్ళకుండా ప్రజలకు సేవలందించాలని పోలీసు సిబ్బందికి సూచించారు.అనంతరం డిఎస్పీ గోదావరి పుష్కర ఘాట్ తీరాన్ని సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఏఎస్ఐ రాజేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.