ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
On
- చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
విశ్వంభర, షాద్ నగర్: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అందజేశారు. ఫరూక్ నగర్ మండలం మధురాపూర్ గ్రామానికి చెందిన ఎన్.సుధాకర్ గౌడ్, నందిగామకు చెందిన డి.సుజాత, కేశంపేట మండలం దేవునిగుడి తండా రాగ్యతండా కి చెందిన అంగోత్ వినోద్, కొత్తూరుకు చెందిన మైలారం సిందూజ, జంగగల్ల క్రిష్ణయ్యలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మధురపూర్ మాజీ సర్పంచ్ బొమ్మ రంగయ్య గౌడ్, పోమాల్ పల్లి మాజీ సర్పంచ్, భూపాల్ రెడ్డి, రావిర్యాల మాజీ సర్పంచ్ నర్సిములు, కొత్తూరు కౌన్సిలర్ గోపాల్ గౌడ్,బిఆర్ఎస్ నాయకులు జహంగీర్ , సుమదీర్ ,జె.ఆర్.దినేష్ సాగర్, మధు తదితరులు పాల్గొన్నారు.
Read More ఈ నెల 24 వరకు గ్రామసభలు