డిగ్రీ విద్యార్థి బిందు శ్రీ కి అండగా మిషన్ శిక్షపాత్ర

డిగ్రీ విద్యార్థి బిందు శ్రీ కి అండగా మిషన్ శిక్షపాత్ర

విశ్వంభర, మచిలీపట్నం: విద్య అనేది హక్కు, అది కొంతమందికే పరిమితం కాకూడదని, ఆర్ధిక కారణాల వలన చదువుకు అడ్డంకులు రాకూడదు అనే దృష్ట్యా మచిలీపట్నం, జలాల్‌పేటకు చెందిన యెన్నేటి బిందు శ్రీ, వాగ్దేవి డిగ్రీ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతిభావంతురాలు. ఆమె తండ్రి ఆనంద్ వర్మ  ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నారు. 

వారి కుటంబ పరిస్థితులు తెలుసుకున్న  హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజెషియన్ ప్రాజెక్ట్స్ లో బాగమైనటువంటి మిషన్ శిక్షపాత్ర  ద్వారా ఇప్పటికే 28 మందికి చదువుకోసం స్పాన్సర్షిప్ లు ఇవ్వటం జరిగిందని, అలాగే బిందు శ్రీ విద్యార్థి కి అండగా మిషన్ శిక్షపాత్ర ద్వారా ఎర్తికల్  సంస్థ,  అట్లాంట కి చెందిన నళిని సహాయంతో బిందు శ్రీ మొదటి సంవత్సరం డిగ్రీ ఫీజును స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. 

Read More నేడు పేరు నమోదు కై గోడపత్రిక ఆవిష్కరణ.

ఉమ భార్గవ్ ద్వారా వారి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు. అక్కడి పరిస్థితులు చూసిన తర్వాత, మన సహాయం నిజంగా అవసరమైన వారికి చేరిందన్న గర్వం కలిగిందని సంస్థ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి విద్యార్ధిని విద్యార్దులను వెన్నుతట్టి ముందుకు నడిపించగలిగితే వీరు రేపటి తరానికి మార్గదర్శకులు అవుతారు. మంచి సమాజాన్ని సృష్టించగలుగుతారనీ, హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ భార్గవ్ అన్నారు.

Tags: