పోలీసులకు సైబర్ నేరగాళ్ల షాకులు.. TS Cop యాప్ హ్యాక్..
వారంలోనే రెండో యాప్ హ్యాక్
కీలక సమాచారం ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టిన వైనం
సైబర్ నేరగాళ్లు పోలీసులకే షాక్ ఇస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే పోలీసుల వద్దకు వెళ్తారు ఎవరైనా. కానీ ఇప్పుడు ఏకంగా పోలీసుల యాప్ లనే హ్యాక్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. వారం గ్యాప్ లోనే రెండోసారి హ్యాక్ చేశారు. ఇప్పటికే అంటే వారం కిందట తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్‌ను హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా టీఎస్ కాప్ యాప్‌ను హ్యాక్ చేశారు. సదరు యాప్ లో కీలకంగా ఉన్న పోలీస్ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని దొంగిలించారు. అంతే కాకుండా ఆ సమాచారాన్ని ఆన్ లైన లో అమ్మకానికి పెట్టేశారు. దీంతో ఇది తెలుసుకున్న తెలంగాణ పోలీసులు వెంటనే అలెర్ట్ అయిపోయారు. కేటుగాళ్లను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయారు.
ఇప్పటికే చాలా మంది సామాన్యలును చాలా రకాలుగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసు శాఖపైనే కన్నేయడం సర్వత్రా ఆందోళన రేకిస్తోంది. ఈ కాప్ యాప్ లో పోలీసులు అంతర్గత సమాచారం మొత్తం ఉటుంది. ప్రజలు కూడా ఈ యాప్ ద్వారానే ఫిర్యాదులు చేస్తుంటారు. ఇందులో పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు ప్రజల ఆధార్, ఫోన్ నెంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. దాంతో ఇప్పుడు ఇవి బయటకు వస్తాయేమో అని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.