కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు

9 వేల ఓట్లతో శ్రీ గణేష్ విజయం

రెండో స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నివేదిక

కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దింపిన శ్రీ గణేష్ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో కాంగ్రెస్‌కు 65 సీట్లు ఆ పార్టీ ఖాతాలో పడ్డాయి. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సాధించారు. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సారి ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్.. పార్టీ మారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ వంశ తిలక్‌కు టికెట్‌ కేటాయించింది. అయితే ప్రధానంగా పోటీ శ్రీ గణేష్ లాస్య నందిత మధ్యే నెలకొని ఉంది. ఏడు రౌండ్లు పూర్తయ్యే సమయానికి శ్రీ గణేష్ కు 24,424 ఓట్లు పోలవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు 16,761 ఓట్లు పోలయ్యాయి. 14,712 ఓట్లు బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ వచ్చాయి. 

 

Read More నల్గొండ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి