అభివృద్ధిని గాలికి వదిలేసి.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా: కమిటీ కన్వీనర్ న్యాలకొండ శ్రీనివాసరెడ్డి.
విశ్వంభరా, ఎల్బీనగర్
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గాలి కి వదిలివేసి పార్టీ ఫిరాయింపుల ను ప్రోస్థహిస్తున్నారు అని మహేశ్వరం నియోజకవర్గము ఉద్యమ కారుల కమిటీ కన్వీనర్ న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్కే పురం లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతం లో పార్టీ ఫిరాయింపుల ను వ్యతిరేకించిన మీరే , ఇప్పుడు నాయకుల ఇంటి దగరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం సిగ్గు చేటు అని అన్నారు. పార్టీ మారినప్పుడు కేసు లు వేసి ఇప్పుడూ స్వాగతం చెప్పడం ఎంటి అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన 6 హామీలు అమలు చేయకుండా కల్లబొల్లి మాటలతో పబ్బం గడుపు తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజలు తిరగ బడే రోజులు దగ్గర పడ్డాయి అని అన్నారు. కేసీఆర్ 10 యేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించింది అని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం కు పాలించే అర్హత కోల్పోయింది అని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ లో కన్న , ఢిల్లీ లోనే ఎక్కువ ఉంటున్నారు అని దుయ్యబట్టారు.
రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయి ఉండి ఇతర గుర్తుల మీద గెల్చిన పార్టీ ల వారిని రావొచ్చు అని అనడం సిగ్గు చేటు అని అన్నారు.
ఈ కార్యక్రమం లో శ్రీమన్నారాయణ , పెంబర్తి శ్రీనివాస్, రమేష్ కురుమ తదితరులు పాల్గొన్నారు