ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు
విశ్వంభర, మేడ్చల్: చీర్యాల ప్రభుత్వ పాఠశాలలో మిలన్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉచితంగా సి సి కెమేరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కీసర సి ఐ ఆంజనేయులు పాఠశాల ప్రిన్సిపాల్ తో కలిసి సి సి కెమేరాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సి ఐ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న కాలంతో పాటు మనం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని అన్నారు. మిలన్ గ్రూప్ ద్వారా పాఠశాలలో సి సి కెమేరాలు ఏర్పాటు చేయడం హర్షిందగిన విషయం అని అన్నారు. పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ లో సి సి కెమేరాలు ఏర్పాటు చేసిన మిలన్ గ్రూప్ అజ్జు ని అభినందించారు . ప్రతి కాలనిలో సి సి కెమేరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది , ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకు అంటే సేఫ్టీ ముఖ్యం అని అన్నారు. నేరస్తులను పట్టుకోవడానికి సి సి కెమేరాలు కీలకం అవుతున్నాయి అని గుర్తు చేశారు. మిలన్ గ్రూప్ అజ్జు మాట్లాడుతూ 15 సంవత్సరాల నుండి సి సి కెమరాలు పెడుతున్నామని, ప్రతి నెల రెండు ప్రభుత్వ స్కూల్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోళ్ల క్రిష్ణ, బీజేపీ పార్టీ నాయకులు తిరుమల్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రదానోపాధ్యాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



