బీఆర్ఎస్ మరో 5 నెలల్లో భూస్థాపితం ... మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ మరో 5 నెలల్లో భూస్థాపితం ... మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

విశ్వంభర, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ మరో 5 నెలల్లో భూస్థాపితం అవుతోందని టీ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కీలక ఆరోపణలు చేశారు. గాంధీభవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కి బీ టీమ్ గా పనిచేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢీల్లి లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన తన కూతురు కవితను బయటకు తీసుకొచ్చేందుకు బీజేపీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 11 ఎంపీ సీట్లు గెలవబోతుందని జ్యోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.