వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

  • బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు
  • రేపు ఉదయం 10 నుంచి 11.30గంటల వరకు ఆంక్షలు 
  • పాతబస్తీలో వాహనాల రాకపోకలు బంద్ 
  • మసీదులు, ఈద్గాల పరిసరాల్లో వాహనాల దారిమళ్లింపు

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. రేపు(సోమవారం) ముస్లింల పవిత్ర పండుగైన బక్రీద్ పండుగను పురస్కరించుకుని పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ప్రకటించారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోంది. 

30వేల మందికి పైగా ముస్లిం సోదరులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత బస్తీలో సుమారు 1000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించే మీరాలం ఈద్ పరిసర ప్రాంతాల్లో, పాతబస్తీలోని పలు రహదారులపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Read More సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ వినూత్న క్యాంపెయిన్‌కు శ్రీకారం

సోమవారం ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా, పురానాపూల్, కమాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గా ప్రార్థనల కోసం వచ్చే వారికే అనుమతి ఉంటుందని తెలిపారు. బహదూర్‌పుర క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 నుంచి 11:30 వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ప్రార్థనలకు వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్క్, మసీదు అర్హ హో అక్బర్ ముందు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

Related Posts