కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్

కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్

విశ్వంభర, పరిగి: పరిగి మండల పరిధిలోని గడిసింగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో  సోమవారం  అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ డిజిటల్ తరగతుల బోధన కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ ఉమా హారతి  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లా నుండి ఆరు పాఠశాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కార్యక్రమంలో కంప్యూటర్ ల్యాబ్ లను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రాథమిక స్థాయిలో చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి కంప్యూటర్ ఆధారంగా సులువుగా నేర్చుకొనుటకు విద్యార్థులు చేసే తప్పులను కంప్యూటర్ గుర్తించి సరైన విధంగా నేర్చుకొనుటకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అనంత్ రావు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్, ఉపాధ్యాయులు భ్రమరాంబ, వెంకటయ్య, విజయ, రామచంద్రయ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags: