భూపాలపల్లి జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు ఆత్మీయ సన్మానం
విశ్వంభర భూపాలపల్లి జూలై 25 : - వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజు దేవుడే సేవలు అభినందనీయమని జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు శామ్యూల్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్న రాజు దేవుడేను ఇటీవల ప్రభుత్వం ములుగు జిల్లాకు బదిలీ చేసిన సందర్భంగా గురువారం మెడికల్ కళాశాలలో గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవుడు ప్రాణం పోస్తే వైద్యుడు జీవం పోస్తాడని, విద్యార్థులకు విద్యతో పాటు అధ్యాపకులు జీవితాన్ని బోధిస్తారని ఆయన పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు మంచిగా చదువుకొని ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. వైద్యవృత్తి చాలా పవిత్రమైందని అటువంటి విద్యనభ్యసిస్తున్న మీరందరూ ఎంతో అదృష్టవంతులని ఆయన తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు
3.5.2023న ప్రధమ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గా భాద్యత చేపట్టిన రాజు దేవుడే సమర్థవంతంగా విధులు నిర్వహించారని అన్నారు. అనంతరం శాలువా పుష్ప గుచ్చంతో ప్రిన్సిపాల్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ అవినాష్, ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.