ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి బానోత్ హుస్సేన్ ప్రతిష్ఠాత్మక ఐఐటీ గౌహతిలో సీటు సాధించడంతో పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా క్రమశిక్షణ, కృషి, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే ఐఐటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించగలరని అన్నారు. హుస్సేన్ విజయం పాఠశాలకు గర్వకారణమని, ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. బానోత్ హుస్సేన్ తన విజయానికి ఉపాధ్యాయుల బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధనే కారణమని చెబుతూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు పాల్గొని హుస్సేన్‌ను అభినందించారు.