470కి 466 మార్కులు.. అంతలోనే అకాల మరణం..
సరస్వతీ పుత్రుడు అకాల మరణం చెందాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 470కి గాను 466 మార్కులు సాధించాడు. దాంతో తల్లిదండ్రులు ఉప్పొంగిపోయారు. కొడుకును చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు. అంతలోనే కొడుకు అందరాని లోకాలకు వెళ్లిపోవడంతో కడుపు కోత మిగిలింది.
ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ వత్సవ్ మొన్నటి ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 170కి గాను 166 మార్కులు సాధించాడు. కొడుకును చూసి తల్లిదండ్రులు ఆనందించే లోపే.. అతనికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకింది. దాంతో వెంటనే ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ చికిత్స పొందుతూ బ్రెయిన్, కిడ్నీ పనిచేయకపోవడంతో పరిస్థితి విషమించి చనిపోయాడు. దాంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.