హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో

హైదరాబాద్ లో 16వ ఎడిషన్ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో

విశ్వంభర, హైదరాబాద్ : దక్షిణాసియాలోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ “16వ సంచిక పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో- 2024” ను నవంబర్ 27 నుంచి 29, 2024 వరకు నిర్వహించనున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ)/ పౌల్ట్రీ ఇండియా వెల్లడించాయి.  హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌లో  జరుగుతుంది. దీనికి అనుబంధంగా ముందు రోజు నవంబర్ 26, 2024న హోటల్ నోవాటెల్(ఎచ్ఐసీసీ) హైదరాబాద్‌ నందు నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ ఉంటుంది.  “అన్‌లాకింగ్ పౌల్ట్రీ పొటెన్షియల్” అనే అంశంపై నెట్‌వర్కింగ్, విజ్ఞానాన్ని పంచుకునేందుకు, అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను  ప్రదర్శించడానికి ఈ అంతర్జాతీయ పౌల్ట్రీ పరిశ్రమ ఒక వేదిక కానుంది.  50కి పైగా దేశాల నుంచి సుమారు 400 మంది ప్రదర్శకులు ఇందులో పాల్గొనే  అవకాశం ఉంది.  కోళ్ళ పరిశ్రమ రైతులు, ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల ఇంటిగ్రేటర్లు, ప్రపంచ పౌల్ట్రీ నిపుణులు సహా దాదాపు 40,000 మంది సందర్శకులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
 ముఖ్యాంశాలు:
•    నాలెడ్జ్ డే 2024 – నవంబర్ 26, 2024  
   నాలెడ్జ్ డేతో ఎక్స్‌పో ప్రారంభమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత నిపుణులను ఒక్క చోటకు చేర్చే ఒక కీలకమైన సాంకేతిక సదస్సు. ఈ సంవత్సరం ఎక్స్ పోలో 25కి పైగా దేశాల నుండి 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పౌల్ట్రీ రంగ వృద్ధికి కీలకమైన అంశాలపై ఏడుకి పైగా సదస్సులో వీళ్ళు పాల్గొంటారు. 
నాలెడ్జ్ డే సమావేశంలో ఆధునిక పద్ధతుల్లో పౌల్ట్రీ ఉత్పత్తి, ఫీడ్ మిల్లులలో ఆవిష్కరణలు, పోషకాహారం మరియు జంతువుల ఆరోగ్యంపై సదస్సులు ఉంటాయి.  పరిశ్రమలోని నిపుణులు మరియు గొప్ప మేధావుల నుంచి కొత్త విషయాలను నేర్చుకోవడానికి  ఈ సదస్సు ఒక అద్భుత అవకాశం కల్పిస్తుంది.
•    పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 2024 – నవంబర్ 27 నుండి 29, 2024 వరకు
దక్షిణాసియాలో అతిపెద్ద పౌల్ట్రీ ప్రదర్శనగా ఈ సంవత్సరం పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో.. కోళ్ళ పరిశ్రమ నిర్వహణ, ఆరోగ్యం, పోషణ, ఉత్పత్తి సాంకేతికతలలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి జాతీయ, అంతర్జాతీయ, ప్రదర్శనకారులను ఒక్క చోటకి చేర్చుతోంది. ఈ ప్రదర్శనను 27,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆరు ఎగ్జిబిషన్ హాళ్లలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సారి 40,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా.
ఐపీఈఎంఏ ప్రెసిడెంట్  సందేశం:
శ్రీ ఉదయ్ సింగ్ బయాస్, ఐపీఈఎంఏ/ పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు, భారతదేశంలో పౌల్ట్రీ పరిశ్రమకు పెరుగుతున్న ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పారు.  భారతదేశ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి,  పోషకాహార సంక్షేమానికి మూలస్తంభమైన పౌల్ట్రీ రంగానికి అండగా నిలవాలని మరియు బలోపేతానికి కృషి చేయాలని  లక్షలాది పౌల్ట్రీ రైతుల తరపున ప్రభుత్వానికి ఐపీఈఎంఏ విజ్ఞప్తి చేస్తోంది. ఏటా ఆర్థిక వ్యవస్థకి రూ. 1.35 లక్షల కోట్ల సహకారాన్ని,  లక్షలాది మందికి అవసరమైన ప్రొటీన్‌లను అందిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ.. ముడిసరుకు వ్యయాలు పెరగడం, ముఖ్యంగా మొక్కజొన్న, సోయా వంటి దాణా ఉత్పత్తులకు; సోయా మీల్, పౌల్ట్రీ పరికరాలపై GST భారం కారణంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ధరలను స్థిరీకరించడానికి, అందుబాటు ధరలో దాణా లభ్యతకు, ప్రాధాన్యతా రంగ రుణ పరిమితిని విస్తరించడం ద్వారా రుణాలను మరింత సులువుగా పొందేలా వీలు కల్పించేందుకు తక్షణ విధానపరమైన జోక్యాలు అవసరం,  ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సోయా మీల్, ప్రాసెసింగ్ మెషినరీపై GST మినహాయింపు,  రబీ మొక్కజొన్న సాగు పెంచడం, దాణా వ్యయాలను స్థిరీకరించడానికి ఇథనాల్ ఉత్పత్తి కోసం చేస్తున్న మొక్కజొన్న దిగుమతులను నియంత్రించాలని మేము కోరుతున్నాం.WhatsApp Image 2024-11-08 at 16.06.40

జంతువుల వ్యాధుల నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్ దిగుమతులకు  సత్వర అనుమతులు,  పిల్లల్లో పోషకాహార లోపం సమస్యను నివారించేందుకు  దేశవ్యాప్తంగా పాఠశాలల భోజన కార్యక్రమాలలో గుడ్డును చేర్చడానికి  మద్దతును మేము కోరుతున్నాము. అధిక డిమాండ్ ఉన్న అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు..   ప్రపంచ వేదికపై పరిశ్రమ పోటీ  సామర్థ్యాన్ని పెంచేలా “ఫోకస్ సెక్టార్” హోదా అవసరం. ఇది పౌల్ట్రీ ఉత్పత్తులకు కీలక ఎగుమతిదారుగా భారతదేశం పాత్రను పెంచుతుంది.
భారతదేశ ప్రత్యేక అవసరాలు, దేశానికి పౌల్ట్రీ రంగం అందిస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకుని నిర్దిష్ట సమతుల్య  విధానాన్ని మేము కోరుతున్నాము. భారతదేశ ఆహార భద్రత లక్ష్యాలకు మద్దతు ఇవ్వడానికి, రైతు సంక్షేమాన్ని మెరుగుపరచడానికి,  పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాము.
16వ సంచిక పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో- 2024కు ప్రపంచ పౌల్ట్రీ సమాజాన్ని ఆహ్వానిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము.  కోళ్ళ పెంపకం, ఔషధ, జంతు ఆరోగ్యం సహా వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50కి పైగా దేశాలకు చెందిన సుమారు 400 మంది ప్రదర్శనకారులను ఇది పరిచయం చేస్తుంది.  నెట్‌వర్కింగ్, సహకారం, ఆవిష్కరణలకు అసమాన అవకాశాలని అందిస్తుంది. పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్తును రూపొందించడానికి  కలిసి పని చేసేందుకు  ప్రతి ఒక్కరినీ హైదరాబాద్‌కు ఆహ్వానించడానికి మేము ఎదురుచూస్తున్నాము.
అభివృద్ధి, ఆవిష్కరణల కోసం ఒక వేదిక:
16వ సంచిక పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో -2024.. పరిశ్రమ నిపుణుల కోసం కొత్త వ్యాపారావకాశాలను అన్వేషించడానికి, కోళ్ల పెంపకం, దాణా సాంకేతికతలు, ఆరోగ్య నిర్వహణలో  వస్తున్న సరికొత్త మార్పులు, పరిశ్రమ భవితపై చర్చల్లో పాల్గొనడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తుంది.    సరఫరాపరమైన అంతరాయాలు, పర్యావరణ సమస్యలు,  వ్యాధుల నిర్వహణ తదితర రూపంలో  కోళ్ళ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై కూడా ప్రదర్శన దృష్టి సారిస్తుంది.  పౌల్ట్రీ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి స్థిరమైన పద్ధతులు, సాంకేతిక పురోగతి, వ్యాపార వ్యూహాలపై విలువైన సమాచారాన్ని హాజరైన ప్రతీ సందర్శకులు పొందగలుగుతారు. 
పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో గురించి:
ఐపీఈఎంఏ నిర్వహిస్తున్న 16వ విడత పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో – 2024..  విజ్ఞానం, ఆవిష్కరణలను పంచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులను ఒక్క చోటకి చేర్చడం ద్వారా పౌల్ట్రీ నిపుణులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుంది.  పౌల్ట్రీ సైన్స్, ఫీడ్ ఎక్విప్‌మెంట్, బ్రీడింగ్ టెక్నాలజీస్, యానిమల్ హెల్త్ సొల్యూషన్స్, పోషకాల పరిశోధనలో అత్యంత అధునాతన మార్పులకు  ప్రదర్శనగా ఉపయోగపడుతుంది.  అవగాహన, ఆవిష్కరణల ద్వారా పౌల్ట్రీ పరిశ్రమను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తూనే..  పౌల్ట్రీ నిర్వహణ, ఉత్పత్తిలో ఉత్తమ ప్రమాణాలు, వినూత్న ధోరణులను అన్వేషించడానికి ఒక ప్రధాన వేదికగా నాలెడ్జ్ డే టెక్నికల్ సెమినార్ నిలుస్తుంది.పరిశ్రమ నిపుణులకు ఆహ్వానం..
పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోకు  ఎక్జిక్యూటివ్ అడ్వైజరీ కమిటీ (EAC) ఎనలేని మద్దతు.
పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పాలసీ రూపకర్తలు పౌల్ట్రీ రంగంలోని పరిశ్రమల వారు, విద్యావేత్తలు కలిసిన ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ కమిటీ (EAC) సభ్యులు. ఇండియన్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (IPEMA) ప్రముఖులతో కలిసి  ఆలోచనాపరులు పోల్ట్రీ ఇండియా ఎక్స్పోలను ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేస్తున్నారు.
ఈ సంవత్సరం 16వ ఎడిషన్ ఎక్స్పో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉంటుంది. ఇది EAC వారి నిరంతర మద్దతు, కృషి ఫలితంగా సాధ్యమైంది.
హైదరాబాద్‌లో నవంబర్ 27 నుండి 29, 2024 వరకు జరిగే 16వ విడత పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో కు హాజరుకావాలని పరిశ్రమ నిపుణులందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. పౌల్ట్రీ పరిశ్రమను ముందుకు నడిపించే ఆవిష్కరణలు, వినూత్న మార్పులతో ఈ వేడుక  జరుపుకోండి. దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ నిపుణుల సమావేశంలో భాగం అవ్వండి.
మరిన్ని వివరాల కోసం దయచేసి కింది వాటి ద్వారా  IPEMAని సంప్రదించండి:  
ఇమెయిల్: office3@poultryindia.co.in 
ఫోన్: +91 7997994331
పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 2024 గురించి మరింత సమాచారం కోసం, దయచేసి www.poultryindia.co.inని సందర్శించండి.

Read More మానవత్వం చాటుకున్న మహారాజు

Tags: