తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడి ఎన్నికలు - మార్చి 3వ తేదీన ఎన్నికల పోలింగ్ 

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడి ఎన్నికలు -    మార్చి 3వ తేదీన ఎన్నికల పోలింగ్ 

షెడ్యూల్ ఖరారు చేసిన ఎన్నికల అధికారి  తొడుపునూరి చంద్రపాల్ 

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రిజిస్టర్ నెంబర్  363/2015  అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి  తొడుపునూరి చంద్రపాల్ విడుదల చేసారు. ఎన్నికల నిర్వహణ , పూర్తి  ప్రక్రియ హైదరాబాద్ లోని , చింతల్ బస్తీలో  వైశ్య భవన్ లో జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలియజేసారు. ఎన్నికల షెడ్యూల్ వివరాలను క్రింది విధంగా తెలుపుతున్నాం... 

  • 17-2-2025 సోమవారం ఉదయం  10:00 నుండి మ. 3:00 గం.ల వరకు  వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట  చేయాలనీ తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు స్క్రూట్నీ , అనంతరం ఐదు గంటలకు నికర జాభితా ప్రకటన చేయబడుతుంది అన్నారు.
  •  18-2-2025 మంగళవారం ఉదయం  10:00 నుండి సాయంత్రం 4:00 గం.ల వరకు  ఉపసంహరణలు ఉంటాయని అనంతరం ఐదు గంటలకు నికర జాబితా ప్రకటన తెలుపుతామని అన్నారు.   
  • 4-3-2025 మంగళవారం ఉదయం 9 గంటల నుండి సాయన్తరం 5 గంటల వరకు ఎన్నికల పోలింగ్ , సాయంత్రం 6 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుందని అన్నారు. 
  • పోలింగ్ జరుగు స్థలం వాసవి కల్యాణ మండపం , వాసవి కేంద్రం , సెన్సేషన్ థియేటర్ ఎదురుగా లక్డికపూల్, హైద్రాబాద్ లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

గమనిక :- 

Read More ట్రల్లిస్ స్కూల్‌లో విచారణ మొదలు.. రంగంలోకి చైల్డ్ వెల్ఫేర్ కమిషన్

1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 

2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడును. 

3) ఓటు వేయడానికి వచ్చే జనరల్ కౌన్సిల్ సభ్యులందరూ విధిగా తమ ఆధార్ కార్డు గాని, పాన్ కార్డు గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని, పాస్పోర్ట్ గాని ఒరిజినల్ ప్రూఫ్ను తీసుకువచ్చి ఓటు హక్కును వినియోగించుకోగలరు. 

రాష్ట్ర అధ్యక్షునిగా పోటీ చేయుటకు అర్హతలు:-

1) 5 సంవత్సరముల నుండి మహాసభ జీవిత సభ్యునిగా ఉండవలెను. 

2) జిల్లా మహాసభ అధ్యక్షునిగా రెండు సంవత్సరములు పని చేసి ఉండవలెను. 

3) ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) లో మరియు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) లో పదవులు నిర్వహించిన, నిర్వహిస్తున్న వారు పోటీకి అనర్హులు. 

4) మహాసభ నుండి సస్పెండ్ కాబడిన వారు పోటీకి అనర్హులు. 

5) నాన్ రిఫండబుల్ నామినేషన్ ఫీజు రూ.1,00,000/- చెల్లించి నామినేషన్ ఫారములు తీసుకొనవలెను. 

6) నీతి బాహ్యమైన నడవడిక కలవారు, చట్టవిరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొని క్రిమినల్ కేసులలో ఆరు మాసములకు తగ్గకుండా జైలు శిక్ష విధింపబడిన వారు మరియు కోర్టులో ఇన్సాల్వెంట్గా ప్రకటించమని పిటిషన్ దాఖలు చేసి పెండింగ్లో ఉన్న వారు, ఇన్స్టాల్వెంట్గా కోర్టు చేత నిర్ణయింపబడిన వారు మరియు ఇన్సాల్వెంట్గా విముక్తి పొందని వారు (అన్ డిశ్చార్జ్డ్ ఇన్స్టాల్వెంట్) మరియు మతి స్థిమితము లేనివారిగా కోర్టు నిర్ణయింపబడిన వారు పోటీకి అనర్హులు. 


పై ప్రక్రియ పూర్తిగా ఎన్నికల అధికారి  తొడుపునూరి చంద్రపాల్ సమక్షములో నిర్వహించబడుతుంది.

Tags: