ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: మాజీ క్రికెటర్

ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: మాజీ క్రికెటర్

ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 17వ సీజన్‌లో చెన్నై తన లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ ఆడబోతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది.

ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 17వ సీజన్‌లో చెన్నై తన లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ ఆడబోతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. చెన్నై ప్లే ఆఫ్స్‌కు వెళ్లకపోతే ఎంఎస్ ధోనీ ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుందని భారత మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ పేర్కొన్నాడు. అయితే, ధోనీ నుంచి అసలైన ఆట బెంగళూరుపై చూడబోతున్నామని తెలిపాడు.

అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. ఈ మ్యాచ్ జరగాలని ప్రతిఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా, శనివారం ఎంఎస్ ధోనీ షోను చూస్తామనే నమ్మకం తనకుందని ఆరోన్ తెలిపాడు. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మనం ధోనీ ఆటను చూశాం...అయితే, చిన్నస్వామి స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ధోనీ ఇక్కడ ఆడాడని అన్నాడు. గతంలో ఓసారి చివరి ఓవర్‌లో 20 పరుగులను ఒక్కడే బాదేశాడని గుర్తు చేశాడు. అయితే, ధోనీ అత్యంత ప్రమాదకారి అని వ్యాఖ్యానించాడు. మరోసారి అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు ఆరోన్.

కాగా, ప్రస్తుత సీజన్‌లో ధోనీ ఇన్నింగ్స్ చివర్లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకటి లేదా రెండు ఓవర్లు ఉన్నప్పుడు ధనాధన్ షాట్లతో అలరించాడు. ఇప్పటివరకు 13 మ్యచుల్లో 136 పరుగులు రాబట్టాడు. అందులో ఎక్కువగా బౌండరీల రూపంలో వచ్చినవే. అయితే, ఈసారి మాత్రం ఇంకాస్త ముందుగా బ్యాటింగ్ చూడాలనేదే అభిమానుల కోరిక అని ఆరోన్ వ్యాఖ్యానించాడు.

Related Posts