సులువుగా ఏదీ వదిలిపెట్టను.. చివరిదాకా పోరాడుతా: పాండ్యా

సులువుగా ఏదీ వదిలిపెట్టను.. చివరిదాకా పోరాడుతా: పాండ్యా

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో జట్టుతో కలిసిన హార్దిక్ బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ తాను ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్టపరిస్థితులను మీడియాతో పంచుకున్నాడు.

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ 2024లో కెప్టెన్‌గా విఫలమైన బాధలో ఉండగా ఇప్పుడు టీ 20 ప్రపంచ కప్‌లో ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కెరీర్ పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్న పాండ్యా వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో జట్టుతో కలిసిన హార్దిక్ బంగ్లాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో చెలరేగాడు. 40 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ తాను ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్టపరిస్థితులను మీడియాతో పంచుకున్నాడు. ఏ సమస్యను సులువుగా వదిలిపెట్టనని చెప్పాడు. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తానని తెలిపాడు. 

‘జీవితం అయినా మైదానం అయినా.. ఈ యుద్ధంలో చివరి వరకూ పోరాడుతూనే ఉండాలి. క్లిష్ట పరిస్థితుల్లో వాటిని వదిలేస్తే అనుకున్న ఫలితాలను సాధించలేం. నేను సాధించడంపైనే దృష్టి పెడతా. ఇలాంటి పరిస్థితి నాకు కొత్తేం కాదు. పోరాడుతూ ఉంటే పరిస్థితుల్లో మార్పు వస్తుంది. జీవితంలో బ్యాడ్ డేస్ మాత్రమే కాదు.. గుడ్ డేస్ కూడా ఉంటాయి. త్వరలోనే అన్నీ అనుకూలంగా మారుతాయని ఆశిస్తున్నా’ అని పాండ్యా అన్నాడు.

Related Posts

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు