జిమ్నాస్టిక్స్‌లో 8 ఏళ్ల అనర్ఘ్య కు గోల్డ్ మెడల్
విశ్వంభర, బషీర్ బాగ్ : ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల అనర్ఘ్య నిమ్మతోరి జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి హైదరాబాద్ జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది.హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఏరోబిక్స్ ఫిట్‌నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన ఈ పోటీల్లో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. అనర్ఘ్య తన అద్భుతమైన బ్యాలెన్స్, ఫ్లెక్సిబిలిటీ, బలం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చి ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ మరియు ప్రశంసా పత్రం అందజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జోగి కృష్ణ, జనరల్ సెక్రటరీ రాజా సింగ్, జాయింట్ సెక్రటరీ బ్రహ్మానంద ప్రసాద్ అనర్ఘ్యకు గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికెట్ అందజేసి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.