స్కాట్లాండ్‌పై ఆసీస్ విజయం.. సూపర్ 8కు చేరిన ఇంగ్లండ్
On
- 19.4 ఓవర్లలో 181 లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్
- ఇంగ్లండ్‌కు కలిసొచ్చిన స్కాట్లాండ్ ఓటమి
- మెరుగైన రన్ రేట్‌తో సూపర్-8కు ఇంగ్లండ్
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ 180/5 పరుగులు చేసి ఆసీస్‌కు 181 పరుగులను నిర్ధేశించింది. ఈ స్కోరును ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇంకా రెండు బాల్స్ మిగిలి ఉండగానే 19.4 ఓవర్లలో ఛేదించారు.
ఆసీస్ జట్టులో ట్రావిస్ హెడ్(68), స్టొయినిస్ (59) పరుగులతోరాణించారు. ఈ మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలకంగా మారారు. ఈ మ్యాచ్‌కు ముందు నమిబియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాయింట్లు సమమైనప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో స్కాట్లాండ్‌ను దాటి ఇంగ్లండ్ సూపర్ 8కు చేరింది. దీంతో గ్రూప్-బిలో ఉన్న స్కాట్లాండ్ ఇంటి బాట పట్టింది.