మానవత్వం చాటుకున్న శ్రీ సరస్వతి విద్యా మందిర్
On
విశ్వంభర, భూదాన్ పోచంపల్లి:- రెండు కిడ్నీలు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్న జోగు పాండు కుమారుడు జోగు కళ్యాణ్ పరిస్థితి చాలా హృదయ విధారకంగా ఉంది. కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ కొరకు 15 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు.ఈ వార్త తెలుసుకున్న సరస్వతి విద్యామందిర్ పాఠశాల వారు కిడ్నీ భాధిత కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందజేశారు. శ్రీ సరస్వతి విద్యామందిర్ పాఠశాల వారు మానవత దృక్పథంతో ముందుకు వొచ్చి మాకు 25000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం మంచి పరిణామం అని స్థానికులు అన్నారు.*ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సత్యనారాయణ, పాఠశాల హెడ్మాస్టర్ భాస్కర్ నామని, మరియు పాఠశాల ఉపాధ్యాలకి మరి విద్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



