హోం మంత్రిత్వ శాఖను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్... అప్రమత్తమైన భద్రతా బలగాలు

విశ్వంభర, ఢిల్లీ ; ఇటీవల వరసగా దేశంలోని పలు నగరాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు బూటకపు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 

దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించి, ఏం లేదని తేల్చారు. న్యూఢిల్లీ ఏరియాలోని నార్త్ బ్లాక్ పోలీస్ కంట్రోల్ రూంకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హోంశాఖ భవనం వద్దకు రెండు ఫైర్ ఇంజన్లను పంపించారు.

Read More ఒడిశాలో జూలపల్లి ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శన

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్న హోం మంత్రిత్వ శాఖను పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో హోం శాఖ కొలువుదీరిన నార్త్ బ్లాక్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అయితే అనుమానాస్పదమైంది ఏదీ కనిపించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బెదిరింపు మెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందింది.

🕒 22 May 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/security-forces-alerted-to-mail-threatening-to-blow-up-home/article-595

Related Posts

Advertisement

LatestNews

విప్లవ, కళా యోధుల ఆశయాలు  సాధిద్దాం. - సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు .
20న చలో కలెక్టరేట్ . -వంగూరు రాములు పిలుపు .
చేనేత వస్త్ర ప్రదర్శనకు ముఖ్య అతిధిగా రావాలని మంత్రి తుమ్మలకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
చేనేత వస్త్ర ప్రదర్శనకు రావాలని ఎమ్మెల్సీ ఎల్ .రమణకు ఆహ్వానం - -తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ 
ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ను కలిసిన మాదరి చంద్రశేఖర్ 
ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన.  - గుంటక రూప సదాశివ్
మానవత్వం చాటుకున్న గద్దె విజయ్ నేత - దివ్యాంగురాలుకి  వీల్ చైర్ అందజేత.