ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో బీభత్సం సృష్టించిన పోలీసులు!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు అల్లర్లు ఇంకా సర్దుమనగలేదని తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనేలా గొడవలు జరుగుతున్నాయి. ఎన్నికల రోజు రెండు వర్గాల మధ్య మొదలైనటువంటి గొడవలు ఇప్పటికీ చల్లారలేదు. జేసీ వర్గీయుల దాడికి పెద్దారెడ్డి తాడిపత్రి వదిలి వెళ్లారు.
పెద్ద ఎత్తున జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటిపై దాడులు చేశారు. అయితే చాలా ఆలస్యంగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా పోలీసుల పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టి ఆయన అనుచరులపై విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నింటిని ధ్వంసం చేసి ఆయన అనుచరులపై దాడి చేస్తున్నటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇలా సీసీ కెమెరాలో రికార్డు అయినటువంటి ఈ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసుల ఇలా ఏకపక్షంగా ప్రవర్తిస్తూ ఎమ్మెల్యే ఇంటిలోకి చొరబడటంతో ఈ విషయం కాస్త పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది.
ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టి.. దాడి చేసిన పోలీసులు..
— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024
తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, సీసీటీవీని పగులగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తున్న పెద్దారెడ్డి అనుచరులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సీసీ ఫుటేజ్.. pic.twitter.com/h8o6qJ8tba