వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ 

వారణాసిలో ప్రధాని మోడీ వెనుకంజ 

లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని మోడీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అజయ్ రాయ్ మొదటి రౌండ్‌లో 4,998 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

లోక్ సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని మోడీ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అజయ్ రాయ్ మొదటి రౌండ్‌లో 4,998 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రధాని మోడీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ముచ్చటగా మూడో సారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. 

అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఇన్ని రోజులుగా కంచుకోటగా భావించిన ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ వెనుకబడింది. అక్కడ 80 ఎంపీ స్థానలుండగా 42చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారణాసి లోక్‌సభ స్థానానికి ఎన్నికల చివర దశ అంటే ఏడో దశలో జూన్ 1వ తేదీన పోలింగ్ జరిగింది.

Read More ఒడిశాలో జూలపల్లి ఒగ్గు డోలు కళాకారుల ప్రదర్శన

రెండు పర్యాయలుగా వారణాసిలో బంపర్‌ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. వారణాసిలో మోదీ విజయం ఖాయమని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్‌లోనూ మోదీ విజయం ఖాయమని స్పష్టం చేశాయి. అయితే ప్రస్తుతం మోదీ ఆ స్థానంలో వెనుకంజలో ఉండటం గమనార్హం.

🕒 04 Jun 2024 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/national/pm-modi-lags-behind-in-varanasi%C2%A0/article-1185

Related Posts