ప్రేమలో పడ్డాను కానీ...పెళ్లి చేసుకోలేకపోయా...సిద్దరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రేమలో పడ్డాను కానీ...పెళ్లి చేసుకోలేకపోయా...సిద్దరామయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

విశ్వంభర, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాను కానీ పెళ్లి చేసుకోలేకపోయానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైసూరులో బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని కులాంతర వివాహాల విషయంపై మాట్లాడారు. చదువుకునే రోజుల్లో తానూ ప్రేమలో పడ్డానని, కానీ  కులం వేరే అవ్వడం వల్ల ప్రేమను వదులుకోవాల్సి వచ్చిందని అన్నారు.

 తాను వివాహం చేసుకుంటానని అడిగినప్పుడు వారి కుటుంబ సభ్యులతో పాటు ఆ అమ్మాయి కూడా పెళ్లికి ఒప్పుకోలేదని తెలిపారు. దానికి కారణం తాను వేరే కులానికి  చెందిన వాడినవడమేనని పేర్కొన్నారు. దీంతో మరో ఆలోచన చేయకుండా తమ వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడానని  చెప్పుకొచ్చారు.

Read More పూరీ బీచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి సైకత శిల్పం, రేవంత్ బర్త్ డే సందర్భంగా అభిమానాన్ని చాటుకున్న మెట్టు సాయి కుమార్..

అనంతరం మాట్లాడుతూ... కులాంతర వివాహాలు చేసుకునే వారికి తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన సహాయం అందిస్తుందని తెలిపారు. సమాజంలో కుల నిర్మూలన కోసం ఎందరో సంఘ సంస్కర్తలు కృషి చేసినప్పటికీ సమానత్వం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిర్మూలించాలంటే రెండే మార్గాలు ఉన్నాయన్నారు. ఒకటి కులాంతర వివాహం, మరొకటి అన్ని వర్గాలు సామాజిక, ఆర్ధిక అభివృద్ధిని సాధించడం అని పేర్కొన్నారు.

Related Posts