నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం పూర్తిగా నా వ్యక్తిగతం... దయచేసి అలా ట్రోల్ చేయద్దు అనిక ఎమోషనల్ కామెంట్స్
విశ్వంభర, వెబ్ డెస్క్ : అనిక సురేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే తన నటనతో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకుంది. గత ఏడాది అనికా సురేంద్రన్ బుట్ట బొమ్మ మూవీతో హీరోయిన్ గా ఆడియన్స్ ను అలరించింది. అయితే ఈ అమ్మడు ఓ పక్క సినిమాలు చేస్తూనే...సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటుంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిక తనపై వస్తున్న ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ' ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి కారణం గ్లామరస్ డ్రెస్ వేసుకుని కనిపించడం. అయితే నేను వేసుకునే దుస్తులు గురించి కూడా కొందరూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడం పూర్తిగా అది నా వ్యక్తిగతమైన విషయం.
ఎవరికోసం నా ఇష్టాన్ని పక్కన పెట్టలేను. కామెంట్ పెట్టాలనే ఉద్దేశం ఉన్నవారు... చీరకట్టినా కామెంట్స్ చేస్తారు. గ్లామరస్ డ్రెస్ వేసినా కామెంట్లు పెడతారు. అయితే నా డ్రెస్సింగ్ గురించి చేసే కామెంట్స్ నాకు బాధను కలిగిస్తున్నాయి. నేను మనిషినే కదా... నాకు ఫీలింగ్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది. దయచేసి ఎలా పడితే అలా మాట్లాడకండి. మీకు నచ్చినట్టు మీరు ఎలా ఉంటున్నారో నాకు నచ్చినట్లు నేను ఉంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది.